ETV Bharat / state

పేట్లబురుజు ఆస్పత్రిలో 32 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా

హైదరాబాద్​ పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో మరికొందరు కరోనా వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. ఇప్పటికే నలుగురు పోస్టు గ్రాడ్యుయేట్ వైద్యులకు మహమ్మారి సోకగా... తాజా కేసులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Corona for some more people at Patelburu Hospital in hyderabad
పేట్లబురుజు ప్రసుతి ఆస్పత్రిలో మరికొందరికి కరోనా
author img

By

Published : Jun 16, 2020, 10:29 AM IST

హైదరాబాద్‌ పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రిలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే నలుగురు పోస్టు గ్రాడ్యుయేట్ వైద్యులు ఇప్పటికే మహమ్మారి బారిన పడగా... తాజా పరీక్షల్లో మరికొందరికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.

పోస్టు గ్రాడ్యుయేట్ వైద్యులకు పరీక్షలు నిర్వహించిన ఇద్దరు ప్రొఫెసర్లతో పాటు... మరో 12 మంది వైద్యులకు కొవిడ్ నిర్ధరణ అయింది. ఆస్పత్రిలో విధులు నిర్వహించే 18మంది పారిశుద్ధ్య సిబ్బందికి సైతం కరోనా లక్షణాలు గుర్తించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబొరేటరీలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.