ETV Bharat / state

గ్రేటర్‌ హైదరాబాద్‌లో శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. కరోనా పరీక్షలు, వాటి ఫలితాలు, నిర్ధరణ అయిన వారిని ఆస్పత్రులకు తరలింపులలో అధికారులు చేతులెత్తేశారు. పాజిటివ్‌ వచ్చిన వేల మంది దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతోపాటు ఆయ‌న కుటుంబ సభ్యులు, పనిమనిషికి కొవిడ్​ పాజిటివ్ వ‌చ్చింది. రైల్వే పోలీసుల్లో 10 మందికి పాజిటివ్ వచ్చింది. మరోవైపు జంట నగరాల్లో సోమవారం ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, వైద్య సిబ్బంది పర్యవేక్షణ దాదాపుగా ముగిసిపోయింది.

Corona expanding rapidly in Greater Hyderabad
గ్రేటర్‌ హైదరాబాద్‌లో శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా
author img

By

Published : Jul 20, 2020, 10:51 PM IST

హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ సామాజికంగా వ్యాపిస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఒక వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందన్న విషయాన్ని వదలివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు నెల రోజులకే కంటైన్‌మెంట్లను తొలగించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారు. వారిలో కొంత మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవటం వల్ల సాధారణ ప్రజలు కూడా వారిని గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి మరింత మంది కారణమవుతున్నారు. ఇళ్ల వద్దనే ఉండి ప్రైవేట్‌ ఆస్పత్రుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటన్న వారు కూడా బయట తిరుగుతున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఆరోగ్యాన్ని వాకబు చేసేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి ఫోన్లు చేస్తున్న వైద్య సిబ్బందికి తాము బయట ఉన్నామంటూ సమాధానం చెప్తుండటం విస్తుగోల్పుతోంది. వైద్యులు హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవటం లేదు. ఈనెల చివరి నాటికి జంటనగరాల పరిధిలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 64

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యే సతీమణి, కుమారుడు, పనిమనిషికి కొవిడ్​ సోకినట్టు తేల్చారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గం పరిధిలో 18 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. మీర్​పేట్ మున్సిపాలిటీ ప‌రిధిలో 25 మందికి కొవిడ్​ నిర్ధర‌ణ అయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మల్కాజిగిరి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో 58 మందికి పరిక్షలు చేయగా.. ఆరుగురికి పాజిటివ్, ఉప్పల్ సర్కిల్లో 67 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.

బండ్లగుడ ప్రాంతాల్లో మొత్తం 184

హైదరాబాద్ చంద్రాయణగుట్ట సర్కిల్లోని బార్కస్, ఉప్పుగూడ, పార్వతీనగర్, బండ్లగుడ ప్రాంతాల్లో మొత్తం 184 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్​ వచ్చింది. కార్వాన్ యూపీహెచ్​సీలో 71 మందికి పరీక్ష‌లు చేయగా..18 మందికి పాజిటివ్ వ‌చ్చింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల్లో 10 మందికి పాజిటివ్ నిర్ధర‌ణ అయిన‌ట్లు రైల్వే సీపీఆర్​వో రాకేష్ వెల్లడించారు. సీఐతోపాటు మరో 9 మందికి కరోనా నిర్ధరణ అయింది. వారంతా హోం ఐసోలేషన్​లో ఉన్నారు. కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి.

క‌రోనా పరీక్షలు నిలిపివేశారు

కొండాపూర్ ప్రభుత్వాసుపత్రిలో బోనాల పండుగ సెలవు అంటూ క‌రోనా పరీక్షలు నిలిపివేశారు. పరీక్షల కోసం వచ్చిన వారు వెనుదిరిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ బోర్డు స‌భ్యుడు య‌శోద ఆస్పత్రిలో క‌రోనా చికిత్స పొందుతూ మృతి చెందారు. శామీర్​పేట పీహెచ్​సీలో 61 మందికి పరీక్షలు నిర్వహించగా.. 15 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అంబర్​పేట నియోజకవర్గ పరిధిలో సోమవారం 27 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. బర్కత్‌పురలో 62 ఏళ్ల వృద్ధుడు గాంధీలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించాడు. అంబర్​పేట్ డివిజన్ పరిధిలో 9 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి : ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ లేక చనిపోవడం దారుణం : ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.