కరోనా కారణంగా గత మూడు నెలలుగా గోల్కొండ కోటను అధికారులు మూసివేశారు. అయితే కేంద్రం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సూచనల మేరకు ఇవాళ్టి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకి 2వేల మందిని అనుమతినిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవాళ మాత్రం ఇప్పటివరకు ఆరుగురు గోల్కొండ కోటను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. కరోనా సమయంలో సందర్శనపై అభ్యంతరాలు రావడం వల్ల రాష్ట్రప్రభుత్వానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు సందర్శకులను అనుమతించాలా వద్ద అన్న విషయంపై లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు.
ఇదీ చూడండి:- నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు