పోషక విలువలున్న పాల ద్వారా కరోనా వైరస్ సోకదని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతు నుంచి పాలు సేకరించాక విజయ డెయిరీలో శాస్త్రీయంగా పాశ్చరైజేషన్ చేయడం వల్ల వైరస్ దరిచేరదని తేల్చిచెప్పారు. లాక్‌డౌన్ ఆంక్షల వల్ల 8 లక్షల లీటర్ల పాల వాడకం తగ్గిన తరుణంలో సేకరణ, రవాణా, సరఫరాలో ఆటంకాలు అధిగమించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. విజయ రైతుల ప్రయోజనాల దృష్ట్యా పాడి పశువులను పూర్తిగా బీమాచేయాలని నిర్ణయించామంటున్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
పాలప్యాకెట్లపై అపోహలొద్దు: పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఎండీ శ్రీనివాసరావు
క్షేత్రస్థాయిలో రైతు నుంచి పాలు సేకరించాక డెయిరీలో శాస్త్రీయంగా పాశ్చరైజేషన్ చేయడం వల్ల కరోనా వైరస్ దరిచేరదని తేల్చిచెప్పారు రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు.