ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా - తెలంగాణలో కరోనా కొత్త కేసులు

రాష్ట్రంలో శనివారం మరో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కేసులు మొదలైన తర్వాత ఇప్పటివరకు ఒక్క కేసూ రాని వనపర్తి జిల్లాలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. మహమ్మారి పంజాకు మరో ఆరుగురు బలయ్యారు. తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా 2,490 మంది మహమ్మారి బాధితులయ్యారు.

corona-cases-rises-in-telangana
విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా...
author img

By

Published : May 31, 2020, 7:19 AM IST

కొవిడ్‌ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం రాష్ట్రానికి చెందిన 60 మందికి, ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 14 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మీడియా ప్రతినిధులకు కరోనా సోకింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 41 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది.

వనపర్తిలో కూడా...

రంగారెడ్డిలో ఐదు, సంగారెడ్డిలో 3, మహబూబ్‌నగర్‌లో 2, జగిత్యాలలో 2, సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌ అర్బన్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిజమాబాద్‌ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి, వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. చికిత్స నుంచి కోలుకుని శనివారం 31 మంది డిశ్చార్జి అయ్యారు. 1010 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మృతుల్లో చిన్నారులు..

కొవిడ్‌తో మరో ఆరుగురు చనిపోగా... రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 77కు పెరిగింది. మరణించిన వారిలో 24 రోజులు, మూణ్నెల్ల వయసున్న చిన్నారులు ఉన్నారు. మృతి చెందిన చిన్నారుల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన బాబు ఉన్నాడు. అమ్రాబాద్‌ మండలం తెలుగుపల్లికి చెందిన దంపతుల శిశివు ఈనెల 27న అస్వస్థతకు గురవ్వగా... గాంధీకి తరలించేలోపే మృత్యువాత పడ్డాడు.

రైలులో పాజిటివ్ వ్యక్తి

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ రెండు కేసులు నమోదయ్యాయి. చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ప్రత్యేక రైళ్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి పాజిటివ్‌గా తేలగా వరంగల్‌లో దించి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి చెన్నైలో రైల్వే ఉద్యోగి. ఆ ప్రయాణికుడున్న బోగిలోని సహచర ప్రయాణికులను మరో బోగిలోకి ఎక్కించారు.

ఇవీ చూడండి: కరోనా చికిత్స ఖర్చుపై 57 శాతం మంది ఆందోళన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.