ఏపీలో గడిచిన 24 గంటల్లో 25,542 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 114 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,824 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
శుక్రవారం వరకు మొత్తం మరణాల సంఖ్య 7,139గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 326 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి ఏపీలో కోలుకున్నవారి సంఖ్య 8,76,698కి చేరింది. ప్రస్తుతం 1,987 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: దిల్లీ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా