ETV Bharat / state

ఏపీలో కొవిడ్​ కలవరం: పల్లెలపై పంజా విసురుతున్న మహమ్మారి

author img

By

Published : May 19, 2021, 9:39 AM IST

ఏపీలో కొవిడ్​ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పట్టణాల కంటే పల్లెల్లోనే వేగంగా విస్తరిస్తోంది. రాకపోకలు పెరగడం వల్ల వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది. మొత్తంగా మే రెండోవారంలో 23.34 శాతం పాజిటివిటీ నమోదైంది.

covid cases in ap
ఏపీ వార్తలు

ఏపీలో కొవిడ్​ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వారాలు గడుస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. ప్రస్తుతం పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ తొలివారంలో పట్టణాలు/నగరాల్లో 60% కేసులు నమోదయ్యాయి. పల్లెల్లో 40% వచ్చాయి. తాజాగా దీనికి భిన్నంగా పట్టణాల్లో 44%, పల్లెల్లో 57% కేసులొచ్చాయి. రాకపోకలు పెరిగిపోతుండడం వల్ల పల్లెల్లో వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది.

ఈనెల 5 నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చినప్పటికీ కేసుల నమోదుపై తగిన ప్రభావం కనిపించలేదు. ఏప్రిల్‌ 1 నుంచి మే 16 వరకుచూస్తే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత వారంలో 38.79% కేసుల నమోదుతో తూ.గో.జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 10.98% కేసులతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి 7వ తేదీ మధ్య రాష్ట్రంలో 2,19,404 నమూనాలను పరీక్షించగా 5.14% పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మే 8 నుంచి 16వ తేదీ మధ్య 8,14,435 నమూనాలను పరీక్షించగా 23.34% పాజిటివిటీ రికార్డయింది.

ఏప్రిల్‌ తొలివారంలో ఈ 3 జిల్లాల్లో అత్యధికం

ఏప్రిల్‌ తొలి వారంలో అత్యధికంగా వైరస్‌ కేసులు నమోదైన తొలి 3 జిల్లాల్లో గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 26,927 నమూనాలను పరీక్షించగా 2,304 (8.56%) కేసులు బయటపడ్డాయి. విశాఖలో 19,179కు 1,591 (8.30%), చిత్తూరు జిల్లాలో 23,518కు 1,939 (8.24%) కేసులు నమోదయ్యాయి.

మే నెలలో..

మే1 నుంచి ఏడో తేదీ వరకు పాజిటివిటీ రేటు తూర్పుగోదావరి (32.94), శ్రీకాకుళం (26.84), కర్నూలు (26.78)లో నమోదయ్యాయి. మే 8 నుంచి 16 మధ్య అత్యధికంగా కేసులు నమోదైన 3 జిల్లాల్లో తూర్పుగోదావరి, అనంతపురం, కడప ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 64,663 నమూనాలను పరీక్షించగా 25,083 (38.79%) మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతపురం జిల్లాలో 52,127 నమూనాలను పరీక్షించగా 19,220 (36.87%) మందికి వైరస్‌ వచ్చింది. కడప జిల్లాలో 47,719 నమూనాలను పరీక్షించారు. 13,509 (28.31%) మందికి వైరస్‌ సోకింది.

కృష్ణా జిల్లాలో..

* ఏప్రిల్‌ తొలివారంలో 21,559 నమూనాలను పరీక్షించగా 1,406 (6.52%) కేసులు వచ్చాయి.

* ఏప్రిల్‌ 8 నుంచి 14 మధ్య 18,128 నమూనాలను పరీక్షించారు. వీటి ద్వారా 1,791 (9.88%) మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.

* ఏప్రిల్‌ 15 నుంచి 21 మధ్య 18,835 నమూనాలను పరీక్షించగా 2,506 (13.31%) మందికి వైరస్‌ సోకింది.

* ఏప్రిల్‌ 22 నుంచి 30 మధ్య 44,536 నమూనాలను పరీక్షించారు. 5,417 (12.16%) మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

* మే 1 నుంచి 7వ తేదీ మధ్య 65,274 నమూనాలను పరీక్షించగా 6,137 (9.40%) మందికి వైరస్‌ సోకింది.

* మే 8 నుంచి 16వ తేదీ మధ్య 79,007 నమూనాలను పరీక్షించారు. వీటిలో 8,678 (10.98%) మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.