ETV Bharat / state

గ్రేటర్​లో పెరుగుతున్న కరోనా .. భయాందోళనలో ప్రజలు

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం కూడా మరిన్ని కొత్త కేసులు నమోదవగా.. మృతుల సంఖ్య పెరుగుతోంది. మహానగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం బీఆర్కే భవన్​, న్యూబోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

corona cases increase in hyderabad people with panic
గ్రేటర్​లో పెరుగుతున్న కరోనా .. భయాందోళనలో ప్రజలు
author img

By

Published : Jun 15, 2020, 7:33 AM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్‌మెన్‌కు కరోనా సోకినట్లు తేలడం వల్ల.. ఎర్రోళ్ల శ్రీనివాస్​కు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

పొరుగుసేవల సిబ్బంది

ఆదివారం బీఆర్కే భవన్‌లో ఐటీ శాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. న్యూబోయిన్‌పల్లి సీతారాంపూర్‌లో ఒకే కుటుంబంలో అందరికి పాజిటివ్ వచ్చింది. నిమ్స్‌ ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న కూకట్‌పల్లి ఎల్లమ్మబండ పీజేఆర్​ నగర్‌లో‌ మహిళకు కరోనా నిర్ధరణ అయింది. ఆమె నివాసం ఉంటున్న కాలనీలోని బ్లాక్‌ను అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

మీడియా సంస్థల్లో సిబ్బందికి

కూకట్‌పల్లి బాగ్యనగర్ కాలనీలో ఇద్దరు వృద్ధులకు కరోనా వైరస్ సోకింది. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న 23 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కరోనా బారిన పడ్డారు. బాజిరెడ్డి, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా గోవర్దన్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి : తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.