హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిని కరోనా పట్టిపీడుస్తోంది. తెలంగాణ ఆర్టీసీకి తలమానికంగా మారిన బస్‌భవన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు కరోనా మహమ్మారి వదలడం లేదు. రోజు విడిచి రోజు దశలవారీగా కొలువులకు వస్తున్నా కొవిడ్ బారిన పడుతున్నారు. మొత్తం నాలుగు అంతస్తులుండగా.. మొత్తం 400 మంది సిబ్బంది, ఉన్నతాధికారులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. జులైలో బస్‌భవన్‌లోని రెండో అంతస్తులో విధులు నిర్వహిస్తున్నవారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనా బాధితులు హోం క్వారంటైన్లో ఉండి వైరస్ బారి నుంచి కోలుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు బస్‌భవన్‌లో పది మందికిపైగా ఉద్యోగులు, అధికారులకు కరోనా పాజిటివ్ సోకింది. కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో బస్భవన్లోనూ కేసులు రావడం వల్ల సిబ్బందిలో కలవరం నెలకొంది.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు