ETV Bharat / state

పైపుల్లో కొత్తిమీర పంట.. అదెలా సాధ్యం!?

పైపుల్లో కొత్తిమీర పంటను పెంచుతున్నారు. అది కూడా కేవలం కోకోపిట్‌లో భూమికి మూడు అడుగుల ఎత్తులో సాగు చేస్తున్నారు. వందశాతం సహజంగా పెంచుతున్న ఈ పంట గురించి.. ఈ కథనం చదివి తెలుసుకుందాం.

Coriander crop
Coriander crop: పైపుల్లో కొత్తిమీర పంట.. ఇదేంది!?
author img

By

Published : Jun 7, 2021, 10:17 AM IST

కొత్తిమీర పంట

చిత్రంలో కనిపిస్తున్న పైపుల్లో పెరుగుతున్న పంట కొత్తిమీర.. కేవలం కోకోపిట్‌ (కొబ్బరి పొట్టు)లో భూమికి మూడు అడుగుల ఎత్తులో పెంచుతున్న ఈ కొత్తిమీర శుచికి-రుచికి తిరుగుండదు.. వందశాతం సహజంగా పెంచినపంట ఇది. బెంగళూరులో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన దారపునేని శేఖర్‌ 20 సంవత్సరాలు ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్ర పోలీస్‌ విభాగంలో ఐటీ ఆర్కిటెక్ట్‌గా పనిచేసి ఇటీవల స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తొర్రూరుకు వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగం చేస్తూ ఆయన అక్కడి వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకున్నారు.

ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమిని లీజుకు తీసుకుని హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో కొత్తిమీరను పండిస్తున్నారు. ఈ విధానంలో పైన పైపుల్లో ఉన్న కొకోపిట్‌లో పెరిగే కొత్తిమీరకు ఆర్వో(రివర్స్‌ ఆస్మోసిస్‌) నీరు, మినరల్స్‌ను అందిస్తారు. అక్కడ మిగిలిన నీరు కింద ఉన్న హౌజులోకి వస్తుంది. ఇక్కడ తేలియాడే థర్మకోల్‌ షీట్‌్్సపై పాలకూరను పెంచుతున్నారు. ఒక్క చుక్క నీరు కూడా వృథా కాదన్నారు. దాదాపు 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానని, మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో అది తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విధానంలో ప్రకృతి నష్టాలు తక్కువ అని శేఖర్‌ చెబుతున్నారు.
ఇదీ చదవండి: కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​వో గుర్తింపు : కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.