నేర రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకే గ్రామాల్లో, పట్టణాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కాచవానిసింగారం, మహేశ్వరి నగర్‌లో సుమారు 200 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని డీసీపీ తెలిపారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్రవాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: చంద్రయాన్-2: ఇస్రో సారథితో ఈటీవీ భారత్ ముఖాముఖి