హైదరాబాద్ బోరబండ డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో పంజాగుట్ట ఏసీపీ తిరుపతి, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలతో పాటు 105 మంది పోలీసులు పాల్గొన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా.. ప్రజలు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని పంజాగుట్ట ఏసీపీ తిరుపతి కోరారు.
ఇవీ చూడండి: అనారోగ్యంతో అలనాటి నటి విజయనిర్మల మృతి