ETV Bharat / state

సహకార సమరం: నేడు ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సహకార సంఘాల’ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఎన్నికైన వార్డు సభ్యులంతా ఇవాళ సమావేశమై తమ సంఘానికి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఇవి పార్టీ రహిత ఎన్నికలే అయినా అన్ని పార్టీల నేతలు తమ మద్దతుదారులను గెలిపించాలని పెద్దఎత్తున ప్రచారం చేశారు.

Cooperative Strike: Election of Chairman and Vice Chairman today
సహకార సమరం: నేడు ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక
author img

By

Published : Feb 16, 2020, 5:08 AM IST

సహకార సంఘాల’ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రమంతా అధికార పార్టీ హవా కొనసాగింది. కరీంనగర్‌, పెద్దపల్లి, మేడ్చల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో మొత్తానికి మొత్తం సంఘాల ఛైర్మన్ల పదవులన్నీ తెరాస మద్దతుదారుల పరం కానున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ అత్యధిక సంఘాలు వారికే దక్కనున్నాయి. ప్యాక్స్‌లోని వార్డులకు శనివారం పోలింగ్‌, ఓట్ల లెక్కింపు జరిగాయి.

ఎన్నికైన వార్డు సభ్యులంతా నేడు సమావేశమై తమ సంఘానికి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఇవి పార్టీ రహిత ఎన్నికలే అయినా అన్ని పార్టీల నేతలు తమ మద్దతుదారులను గెలిపించాలని పెద్దఎత్తున ప్రచారం చేశారు. అయితే, సంఘాల సభ్యులైన కర్షకులు అత్యధిక శాతం తెరాస మద్దతుదారులకే ఓటు వేసి గెలిపించారు.

జిల్లాల వారిగా పోలింగ్​​ నమోదు శాతం

  1. రాష్ట్రంలో మొత్తం 904 సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా.. 157 సంఘాలు ఇంతకుముందే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 747 సంఘాల్లోని 6,248 వార్డులకు పోలింగ్‌ నిర్వహించారు. 11.48 లక్షల ఓటర్లకుగాను 79.36 శాతం (9.11 లక్షలు) మంది ఓటు వేశారు.
  2. అత్యధికంగా మేడ్చల్‌లో 89.82 శాతం, అత్యల్పంగా నారాయణపేటలో 55.78 శాతం పోలింగ్‌ జరిగింది. ఒక్క నారాయణపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 70 శాతానికి మించి పోలింగ్‌ నమోదైంది. ఒక్కో సంఘంలో 12 నుంచి 13 వార్డులున్నాయి. కనీసం 7 వార్డులు నెగ్గిన పార్టీ మద్దతుదారులకే ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ పదవులు దక్కుతాయి.
  3. వార్డుల ఎన్నికలు పూర్తయినందున ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికలను నిర్వహిస్తారు. ఆధిక్యతలను బట్టి సింహభాగం ఛైర్మన్‌ పదవులు తెరాసకే దక్కనున్నట్లు ఇప్పటికే తేలినందున ఆదివారం జరిగే ఎన్నికలు లాంఛనమేనని తెలుస్తోంది.
  4. ప్యాక్స్‌కు ఎన్నికైన ఛైర్మన్లంతా కలిసి ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎంఎస్‌) పాలకవర్గాలను ఎన్నుకుంటారు. డీసీసీబీలు పాత 9 జిల్లాలకే ఉన్నాయి. వీటి ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ జారీచేస్తామని సహకార కమిషనర్‌ వీరబ్రహ్మయ్య చెప్పారు.
  5. వారంలోగా డీసీసీబీ ఎన్నికలు పూర్తిచేస్తారు. ప్రతి పూర్వజిల్లాలో ఎన్నికైన ప్యాక్స్‌ ఛైర్మన్లంతా కలసి పూర్వ జిల్లా డీసీసీబీకి 16 మందిని పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఆ 16 మంది తమలో ఒకరిని డీసీసీబీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.
  6. అన్ని జిల్లాల్లో ప్యాక్స్‌ ఛైర్మన్‌ పదవులు అత్యధిక శాతం తెరాస మద్దతుదారులే గెలిచినందున వారి నుంచే డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు ఎన్నిక కానున్నారు. 9 పాత జిల్లాలకు డీసీసీబీ చైర్మన్ల ఎంపిక పూర్తయిన తర్వాత వీరంతా కలసి ‘రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు’(టీఎస్‌క్యాబ్‌) పాలకమండలి ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు.

ఇవీ చూడండి: సహకార పోరులో తెరాస మద్దతుదారుల హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.