జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గ్రేటర్లోని కాంట్రాక్టర్ల ధర్నా నిర్వహించారు. గుత్తేదారులకు జీహెచ్ఎంసీ ఇప్పటివరకూ ఇవ్వాల్సిన రూ.550 కోట్ల బిల్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గతేడాది అక్టోబర్ 10 వరకు చెల్లించిన తర్వాత ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్ఎంపీ, ఎస్సార్డీపీ వంటి పెద్ద ప్రాజెక్టులకు బిల్లులు చెల్లిస్తున్న జీహెచ్ఎంసీ... చిన్న కాంట్రాక్టర్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మొత్తం 2వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారని.. దీంతో వీరంతా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదు