గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వనుందుకు నిరసనగా శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ విభాగాలకు చెందిన కాంట్రాక్ కార్మికులు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో సమ్మెకు దిగారు. కొన్ని రోజుల క్రితం అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు జీతాల విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడం వల్ల ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ నేత నరసింహ తెలిపారు. వేతనాలు అందక కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రులను శుభ్రంగా ఉంచే శానిటేషన్ విభాగం కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
ఇవీ చూడండి:బలపరీక్షకు స్పీకర్ డెడ్లైన్- నేడు ఓటింగ్!