సచివాలయ ప్రాంగణం ఖాళీ చేసే పనులు కొనసాగుతున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే మిగిలిన కార్యాలయాలను తరలించారు. తాజాగా సచివాలయ ప్రాంగణంలో వివిధ చోట్ల ఉన్న పాత, నిరుపయోగ వాహనాలను తరలిస్తున్నారు.
అధికారులు ఉపయోగించిన, వివిధ శాఖలకు చెందిన పాత వాహనాలు చాలారోజులుగా అలాగే పడి ఉన్నాయి. సచివాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్ సహా వివిధ ప్రాంతాల్లో వాటిని అలాగే నిలిపి ఉంచారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ వాహనాలన్నింటినీ నిజాం కళాశాల మైదానానికి తరలిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాటిని క్రేన్ల సహాయంతో తరలిస్తున్నారు. వీలైనంత త్వరగా సచివాలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్