ETV Bharat / state

ఆగని బలిదానాలు.. గుంటూరు జిల్లాలోనే ఇద్దరు.. - ఏపీలో ఇసుక కొరత వార్తలు

ఇసుక కొరత.. కార్మికుల ప్రాణాలు బలి తీసుకుంటూనే ఉంది. సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. బలిదానాలు మాత్రం ఆగడం లేదు. బతుకుపై భరోసా కోల్పోతున్న పరిస్థితుల్లో.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు.. కార్మికులు.

ఆగని బలిదానాలు.. గుంటూరు జిల్లాలోనే ఇద్దరు
author img

By

Published : Nov 2, 2019, 2:12 PM IST

ఆగని బలిదానాలు.. గుంటూరు జిల్లాలోనే ఇద్దరు

ఇసుక కొరత గుంటూరు జిల్లాలో ఇద్దరు కార్మికులను బలి తీసుకుంది. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన గుర్రం నాగరాజు (38) అనే తాపీమేస్త్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక కొరత కారణంగా నాగరాజుకు కొన్నాళ్లుగా ఉపాధి దొరకలేదు. ఓ వైపు కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండగా... మరోవైపు పిల్లల స్కూలు ఫీజులూ కట్టలేని పరిస్థితి వచ్చిందని నాగరాజు భార్య తెలిపారు. చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె చెప్పారు.

పొన్నూరులోనూ...

పొన్నూరులోనూ మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగులమందు తాగి అడపా రవి అనే తాపీ మేస్త్రీ మృతి చెందాడు. అతడికీ కొన్నాళ్లుగా ఉపాధి లేక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. 4 రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న రవి.. చివరికి నిన్న రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సంబంధిత కథనం

''అప్పులు తీర్చలేకే.. మా ఆయన చనిపోయాడు''

Ap_Gnt_01_02_TapiMestri_Sucide_AV_AP10032 CONTRIBUTOR : ramkumar, mangalagiri GUNTUR నోట్... విజివల్స్ డెస్క్ వాట్సప్ కు వచ్చాయి. గమనించగలరు. ( ) ఇసుక కొరత గుంటూరు జిల్లాలో మరో కార్మికుడిని బలిగొంది. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన గుర్రం నాగరాజు అనే తాపీమేస్త్రి ఇవాళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక లేని కారణంగా నాగరాజుకు పని దొరకటం లేదు. ఓవైపు కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండగా... మరోవైపు పిల్లల స్కూలు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి వచ్చిందని నాగరాజు భార్య తెలిపారు. చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె చెప్పారు. విజివల్స్...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.