ETV Bharat / state

బైక్​పై వెళ్తున్న దంపతులను కిందకి ఈడ్చేసిన పోలీసులు.. వీడియో వైరల్!​ - social media viral

Constables Misbehave : పోలీసులు అంటే ప్రజలకు భద్రత భావం. పోలీసుల అంటే శాంతిని కాపాడుతారనే నమ్మకం. అలాంటిదf ఇద్దరు కానిస్టేబుళ్లు.. దంపతులతో ప్రవర్తించిన తీరు.. పోలీసులను విమర్శల పాలు చేస్తోంది. వారి నిర్వాకం ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?

Constables Misbehave with Couples
పోలీసుల దురుసు ప్రవర్తన
author img

By

Published : Jan 20, 2023, 4:54 PM IST

దంపతులపై దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసులు

Constables Misbehave with Couples : ప్రెండ్లీ పోలీసింగ్​ అని పోలీస్​ అధికారులు అంటుంటే.. కొందరి దురుసుతనం వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోంది. ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఆచరణలో కొందరు పోలీసుల తీరు మాత్రం ప్రజలతో దురుసుగానే ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు దంపతులతో ప్రవర్తించిన తీరు.. పోలీసులు అంటేనే ప్రజలు విసుక్కునేలా చేసింది. ఆదోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ సమీపంలో వాహన చోదకుల నుంచి పెండింగ్​లో ఉన్న ఈ-చలానా వసూళ్లను పోలీసులు చేపట్టారు. ఈ క్రమంలోనే దంపతులు.. పోలీసులు చలానాలు వసూలు చేస్తున్న ప్రదేశానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు.

చలానాలను వసూలు చేస్తున్న వారిలో ఓ కానిస్టేబుల్ దంపతుల వాహనాన్ని​ ఆపారు. పెండింగ్​లో ఉన్న చలానాలను, బకాయిలను చెల్లించాలని వారిని అడగగా.. తమ వద్ద డబ్బులు లేవని దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు దంపతులతో వాగ్వాదానికి దిగారు. ఈ విధంగా దంపతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుళ్లు దంపతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.

చాలానా చెల్లించాల్సిందేనంటూ కానిస్టేబుళ్లు వాగ్వాదానికి దిగటంతో పాటు.. వాహనం నడుపుతున్న వ్యక్తిని కానిస్టేబుళ్లు మెడపట్టుకుని లాక్కేళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.