తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెండు దఫాలుగా 4,100మంది వీఆర్‌ఏల నియామకాలు చేపట్టారు. వీరిలో కొందరికి పదోన్నతి లభించగా, మరికొందరు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎంపికైన 2,900 మంది ఉన్నారు. గౌరవ వేతన పద్ధతిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
2020 అక్టోబరులో కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించి, వేతన స్కేలు అమలుచేస్తామని సీఎం ప్రకటించారు. దాన్ని రెవెన్యూశాఖ పట్టించుకోవడం లేదు. అన్ని శాఖల్లో పదోన్నతులతో ఆనందం నిండిన వేళ వీఆర్‌ఏలకు ప్రభుత్వం న్యాయం చేయాలని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.ఈశ్వర్ కోరారు.