ETV Bharat / state

ఇతర గుర్తులతో ఉన్న ఓట్ల లెక్కింపును నిలిపివేయాలి: కాంగ్రెస్​ - congress wrote a letter to sec on election symbols

స్వస్తిక్‌ గుర్తు కాకుండా పోలింగ్‌ స్టేషన్‌ నంబర్లున్న గుర్తుతో ఓటు వేసినా పరిగణలోకి తీసుకోవాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై కాంగ్రెస్​ స్పందించింది. ఇతర గుర్తులతో ఉన్న ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్​ జి.నిరంజన్​ ఎస్​ఈసీ పార్థసారథికి లేఖ రాశారు.

congress wrote a letter to sec partha sarathi on election symbols
ఇతర గుర్తులతో ఉన్న ఓట్ల లెక్కింపును నిలిపివేయాలి: కాంగ్రెస్​
author img

By

Published : Dec 4, 2020, 9:39 AM IST

స్వస్తిక్‌ గుర్తు కాకుండా పోలింగ్‌ స్టేషన్‌ నంబర్లున్న గుర్తుతో ఓటు వేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్​ స్పందించింది. స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర ఏ గుర్తుతో ఓటు వేసి ఉన్నా.. అక్కడ ఓట్ల లెక్కింపును నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ మేరకు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్​ జి.నిరంజన్​ ఎస్​ఈసీ పార్థసారథికి లేఖ రాశారు.

ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని నిరంజన్‌ మండిపడ్డారు. ఎస్​ఈసీ తీసుకున్న నిర్ణయం అనుమానాలకు తావిచ్చేలా ఉందని ఆరోపించారు. తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ తప్పిదాలు జరిగాయని ఆక్షేపించారు.

ఇదీ చూడండి: ఘాన్సీపూర్‌, పూరానాపూల్‌పై ఎస్ఈసీ స్పష్టత.. నో రీపోలింగ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.