కరోనా విజృంభిస్తున్న వేళ సచివాలయం కూల్చి వేయటాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితుల్లో... నూతన సచివాలయ నిర్మాణం అవసరమా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించుకోవాలని సూచించినప్పటికీ... పట్టించుకోలేదని ఆరోపించారు.
కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా కట్టడిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం... ఇతర అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతోందని మండిపడ్డారు. సచివాలయం కూల్చివేత చర్యను ప్రభుత్వ ఉన్మాద చర్య అని విమర్శించారు. రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్న వేళ ఆరు నెలలపాటు కూల్చివేత ఆపలేరా అంటూ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: భారత్లో 20వేలు దాటిన కరోనా మరణాలు