ETV Bharat / state

విద్యుత్​, నీటి బిల్లులను మాఫీ చేయాలి:వీహెచ్​

author img

By

Published : May 27, 2020, 6:38 PM IST

రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పనితీరుపట్ల కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతురావు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బలంగా లేనప్పుడు న్యాయవ్యవస్థే ఆ పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కరోనా పరిస్థితుల విషయంలో న్యాయస్థానం జోక్యం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

vh press meet
విద్యుత్​, నీటి బిల్లులను మాఫీ చేయాలి:వీహెచ్​

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువ చేస్తున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టు... ప్రభుత్వానికి మొట్టికాయలేసిందన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల దగ్గర డబ్బులు లేవని... విద్యుత్తు, నీటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

తప్పుడు సమాచారం ఇస్తున్నారు

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయడం లేదని... వారంతా ఇతర జబ్బులతో చనిపోయినట్లు చెబుతున్నారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ సడలింపుతో... కేసులు పెరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా గాంధీ ఆస్పత్రికి పోలేదని ఆరోపించారు. తిరుపతి వెంకన్న భూములు విషయంపై స్పందించిన వీహెచ్​.. ఆ భూములను అమ్మొద్దని... వాటిని ఎవరు కొనొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: పారిశుద్ధ్య లోపం.. పొంచి ఉంది అనారోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.