స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్లోని అబిడ్స్, గాంధీ భవన్లోని మాజీ ప్రధాని విగ్రహానికి పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వి.హన్మంతరావులు ఘన నివాళులర్పించారు.
దేశ అభివృద్ధికి నెహ్రూ అందించిన సేవలు ఎనలేనివని వీహెచ్ కొనియాడారు. మాజీ ప్రధాని గొప్పతనాన్ని.. నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో.. పీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్, తదితర శ్రేణులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Rahul gandhi: నెహ్రూ వర్ధంతి- రాహుల్ నివాళులు