రాత్రి తొమ్మిది గంటల సమయంలో తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పివేసి... దీపాలు వెలిగించమని ప్రధాని సూచన వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. భాజపా నేతలు పార్టీ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలా చేయడానికి శాస్త్రీయ కారణాలున్నాయా... కరోనా వైరస్‌కు విద్యుత్ దీపాలు ఆర్పివేయమనడానికి కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.
గతంలో జనతా పార్టీ నుంచి 1980 ఏప్రిల్6న భాజపా ఆవిర్భవించిందని అందుకోసమే ఆ ముందు రోజు ప్రజలందరు కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపే విధంగా మోదీ ఆలోచించారని వీహెచ్ ఆరోపించారు. భాజపా ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే ఈ కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. ఈ విషయం ముందే ప్రజలకు చెప్పి ఉండాల్సిందని ఆయన ఆక్షేపించారు.
స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పాత్రికేయులకు సహాయం చేయాలని సూచించారు. కరోనా పోరాటంలో మీడియా పాత్ర కీలకమైనదని ఆయన కొనియాడారు.
ఇదీ చూడండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!