ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారాయని, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం... తర్వాత సంపాదించుకోవడం రాజకీయమైందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు.
రిజర్వేషన్లు అనేవి ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు పేర్కొనడం బాధాకరమన్నారు. రిజర్వేషన్లను ఎత్తి వేయడం పౌరసత్వ సవరణ చట్టం కంటే ప్రమాదకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు.