ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటిలా వ్యవహరించి ఉంటే పోరాటం చేయగలిగే వారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకు ముందు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద వీహెచ్ పుష్పగుచ్చాలు ఉంచి అమరులకు ఘనంగా నివాళులర్పించారు.