డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఏడాదిలోగా ఇళ్లు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. నెక్లెస్‌రోడ్డులోని అంబేడ్కర్ బస్తీలో నిర్మాణంలో ఉన్న రెండు పడకగదుల ఇళ్లను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు.. ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద ఆర్థిక సహాయం రూ.10 వేలు కూడా అధికార పార్టీకి చెందిన వారికే పంపిణీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి... హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'