హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఏమైనా చర్చించాల్సి ఉంటే.. పార్టీ అంతర్గత సమావేశాల్లోనే చర్చించాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి.. కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. బయట మీడియాతో మాట్లాడి పార్టీ పరువును దిగజార్చొద్దని సూచించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకానికి ముందు.. అభిప్రాయ సేకరణ నిర్వహించి, 80 శాతానికిపైగా ఆయనను కోరుకోవడంతోనే అధిష్ఠానం నియమించిందని వివరించారు.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియమితులైన తరువాత అనేక కార్యక్రమాలు నిర్వహించామని మల్లు రవి తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదేదో మాట్లాడారని.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ కూడా అల్టిమేటం జారీ చేశారన్నారు. ఇవన్నీ పార్టీని దిగజార్చేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరిపై గౌరవం ఉందని, ఎలాంటి వ్యతిరేకభావం లేదని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీకి విధేయులైనప్పుడు.. పీసీసీతో చర్చించడం లేదా పార్టీ సమావేశాల్లో లేవనెత్తడం చేయాలన్నారు. అంతేకానీ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: congress training classes: నేటి నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ రాజకీయ శిక్షణా తరగతులు
Jaggareddy: 'పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోను.. షోకాజ్ నోటీసు ఇస్తారో లేదో వాళ్ల ఇష్టం'
Komatireddy Venkat Reddy: రేపటి నుంచి నా తడాఖా ఏంటో చూపిస్తా.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
బీరయ్య కుటుంబానికి 'కాంగ్రెస్' పరామర్శ.. ఫోన్లో ధైర్యం చెప్పిన రేవంత్..