భారత్, చైనా సరిహద్దులోని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో అమరులైన వీరసైనికులకు కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పించనుంది. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులకు నివాళిగా 'అమరవీరులకు కాంగ్రెస్ సలాం' పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం వల్లనే సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మహాత్మా గాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల వద్ద మౌనదీక్ష చేయాలని కోరారు.
ఈ నెల 28న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: సరిహద్దు ఘర్షణపై చైనా రాయబారి శాంతి వచనాలు