పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏఐసీసీ(AICC) పిలుపు మేరకు ఉదయం 11 గంటలకు ముఖ్య నాయకులు వారి వారి ప్రాంతాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొనే ప్రాంతాలను ఆయన వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యలు.. హైదరాబాద్ నాంపల్లి పెట్రోల్ పంపు వద్ద నిరసనలో పాల్గొంటారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా డీసీసీ కార్యాలయం పెట్రోల్ పంపు వద్ద, జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొంటారు.
ఘట్కేసర్ హోటల్ వందన పెట్రోల్ ఎదురుగా ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరిలో ఎంపీ కోమటరెడ్డి, కరీంనగర్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, సంగారెడ్డిలో మరో వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు, కల్వకుర్తిలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, అలంపూర్‌లో మరో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు పాల్గొంటారని తెలిపారు.
మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, భద్రాచలంలో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు పొడెం వీరయ్య, కామారెడ్డిలో మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీలు పాల్గొననున్నారని వివరించారు.