ETV Bharat / state

కాంగ్రెస్​ ఆందోళన

సీఎం కేసీఆర్​పై కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది. తెరాస ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ... అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. శాసన సభ్యులను పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

author img

By

Published : Mar 3, 2019, 11:54 PM IST

Updated : Mar 4, 2019, 7:03 PM IST

హస్తం పార్టీలో ఆందోళన
హస్తం పార్టీలో ఆందోళన
ఆత్రం సక్కు, రేగా కాంతారావు పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లు శనివారం ప్రకటించడంతో కాంగ్రెస్​లోఆందోళన మొదలైంది. అత్యవసరంగా కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశమై చర్చించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ నెల 5నపినపాక, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు నేతలుప్రకటించారు.

ప్రగతి భవన్​కు ర్యాలీ

మొదట ప్రగతిభవన్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని యోచించిన నేతలు వ్యూహాం మార్చారు. భేటీ ముగియగానే అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు.చట్టసభల సభ్యులను ఎంతకు కొనుగోలు చేస్తున్నారో సీఎం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ ఆడుతున్న రాజకీయ క్రీడ జుగుప్సాకరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తనను శాసనమండలి పక్ష నేత పదవి నుంచి తీసేసేందుకు తమ పార్టీ ఎమ్మెల్సీలను తెరాసలోకి తీసుకున్నారని షబ్బీర్‌ అలీ విమర్శించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని కాంగ్రెస్‌లోనే ఉండి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తానని ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యలు ఉన్న ప్రతి చోట కూడా పార్టీ గెలిచిందని ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌ అన్నారు.

తెరాసలోకి వెళ్తున్నట్లు ప్రకటన చేసిన ఇద్దరు సభ్యులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మాటలు నమ్మి ఆత్రం సక్కు, రేగా కాంతారావు ఆమ్ముడుపోయారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.పార్టీ ఫిరాయింపులకు నిరసనగా ఈ నెల 6న రాష్ట్రంలోని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్​ నేతలు ప్రకటించారు.

ఇవీ చూడండి:విద్యార్థిగా కొప్పుల

Last Updated : Mar 4, 2019, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.