ETV Bharat / state

Congress PEC Meeting at Gandhi Bhavan : అతి త్వరలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా.. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట: రేవంత్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 4:38 PM IST

Updated : Sep 3, 2023, 10:39 PM IST

Congress PEC Meeting at Gandhi Bhavan : హైదరాబాద్‌లోని గాంధీభవన్​లో జరిగిన పీఈసీ కమిటీ రెండో సమావేశం ముగిసింది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు జరిగింది. నియోజకవర్గాల వారీగా ఆశావహులకు ప్రాధాన్యతా సంఖ్యలను కేటాయించారు.

Congress PEC meeting at Gandhi Bhavan
Telangana Congress latest news

Congress PEC Meeting at Gandhi Bhavan : కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు, పీఈసీ ఛైర్మన్ రేవంత్​రెడ్డి అధ్యక్షతన.. గాంధీభవన్​లో జరిగిన ఎలక్షన్​ కమిటీ రెండో సమావేశం ముగిసింది. (Congress PEC Meeting at Gandhi Bhavan). ఇందులో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఈ భేటీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, గీతారెడ్డి గైర్హాజరయ్యారు.

అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల కమిటీ ప్రాథమిక కసరత్తు చేసింది. నియోజకవర్గాల వారీగా ఆశావాహులకు ప్రాధాన్యతా సంఖ్యలు కేటాయించింది. మరోవైపు టికెట్ల కోసం.. ఎన్నికల కమిటీలోని సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. తమకే తొలి ప్రాధాన్యత సంఖ్య ఇవ్వాలని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యత ఓటు కోసం నేతలు మిగతా వారి మద్దతు కోరుతున్నారు. సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

T Congress Assembly Elections 2023 Plan : MLAగా పోటీ చేయాలనుందా​? కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. అప్లై చేసేయండి

Revanth Reddy on Selection MLA Candidates : ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్ కవర్​లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందని చెప్పారు. సోమవారం పీఈసీ సభ్యులతో వేర్వేరుగా.. స్రీనింగ్ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు వివరించారు. ఎల్లుండి డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయి.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వివరించారు.

ఈ క్రమంలోనే ఈ నెల 6న ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై.. పీఈసీ ఇచ్చిన నివేదికపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఈ కమిటీ తయారు చేసిన జాబితాను.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తుందని చెప్పారు. మరోవైపు వీలైనంత త్వరగా మొదటి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని.. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

అప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు కూడా సమాచారం ఉండదని రేవంత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఎంపిక (Revanth Reddy on Selection MLA Candidates)పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఈసారి అభ్యర్థుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయబోతున్నామని చెప్పారు. స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాలను ఆధారం చేసుకొని.. వారిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Congress PEC Meeting at Gandhi Bhavan అభ్యర్థులపై కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీదే తుది నిర్ణయం

"అభ్యర్థులపై కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీదే తుది నిర్ణయం. తుదిజాబితాపై పీసీసీ అధ్యక్షుడినైనా నాకు కూడా సమాచారం ఉండదు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈసారి అభ్యర్థుల ఎంపికలో బీసీ వర్గాలకు పెద్ద పీట. స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీల ఎంపిక." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'

అంతకుముందు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వాల్మీకి బోయలు గాంధీభవన్‌కు చేరుకొని.. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని నేతలకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వాల్మీకి బోయల అండ లేకుండా ఎవరూ గెలవలేరని అన్నారు. ప్రతి బోయ బిడ్డ కదలాలని.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

గద్వాలలో బంగళా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బోయలను కేసీఆర్ ఎస్టీ జాబితాలో చేరుస్తానని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. ఆనాడు బంగళాలు బద్దలు కొట్టి.. గట్టు భీమున్ని ఎమ్మెల్యే చేసి పౌరుషాన్ని చూపారని గుర్తు చేశారు. పెద్దల అనుమతితో బోయలకు ఎమ్మెల్యే అవకాశం ఇస్తామని.. లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

Revant Reddy on SC ST Declaration : 'అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తాం'

Last Updated : Sep 3, 2023, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.