ETV Bharat / state

పార్టీలో అంతర్గత విభేదాలు... ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు - congress party problems

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. కులాలు వారీగా, వర్గాల వారీగా పార్టీలో కుంపటి రగులుతోంది. ఒక వర్గం సభ్యులు పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే పోలీసు కేసులు పెట్టగా... మరో వర్గం వారు పార్టీ కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తున్నారు.

congress-party-internal-problems-in-telangana
పార్టీలో అంతర్గత విభేదాలు... ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు
author img

By

Published : Aug 19, 2020, 11:09 AM IST

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీలో ఐఖ్యత కొరవడింది. ఏకతాటిపై ఉండి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిన వీరు... అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఏఐసీసీ పిలుపుమేర చేసే కార్యక్రమాలకు సైతం... కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల నుంచి ఆశించిన మేర స్పందన ఉండడంలేదు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే పిలుపులను పరిగణలోకి తీసుకోవట్లేదనే ఊహగానాలు సైతం వినిపిస్తున్నాయి.

దామోదర్ X దయాకర్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్‌ రెడ్డి వర్గానికి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన అద్దంకి దయాకర్‌ వర్గానికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు చోటు చేసుకున్నాయి. దామోదర్‌ రెడ్డి తరచూ తమను బెదిరిస్తున్నాడని... సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు దయాకర్ ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సొంత నిర్ణయాలు..

ఈ ఘటనతో వారి మధ్య ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి ఇలాంటి బేధాలు వచ్చినప్పుడు... పీసీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కానీ అద్దంకి దయాకర్‌ మాత్రం తనదైన శైలిలో ముందుకెళ్లి... దామోదర్‌ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఈ విషయమై క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కోదండ్‌ రెడ్డి రంగంలోకి దిగారు. భట్టి విక్రమార్కతో సమావేశమై లోతైన చర్చ చేశారు. విభేదాలు ఉంటే... పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలే కానీ.. ఇలా కేసులు పెట్టడం ఏంటని నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేలా పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది.

అతనికెలా ఇస్తారు..

మరోవైపు పార్టీ సీనియర్‌ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు తరచూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ... రేవంత్​ రెడ్డిపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను సొంత పార్టీ నాయకులపై ఎక్కుపెడుతున్నారు. కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించాలంటూ ఆయన రెండు సార్లు... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి లేఖలు రాశారు.

పీసీసీ అధ్యక్ష పీఠం ఎంపీ రేవంత్‌ రెడ్డికి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో వీహెచ్​ ఈ లేఖలు రాసినట్లు తెలుస్తోంది. రేవంత్ వేరే పార్టీ నుంచి వచ్చినందున... పీసీసీ అతనికి ఇస్తే పార్టీకి తీవ్ర నష్టమని, కాంగ్రెస్​ను నమ్ముకుని పని చేస్తున్న రెడ్డేతరులకు ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పలు సందర్భాల్లో రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రధాన అజెండాగా ముందుకు పోవాల్సిన నేతలు... ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తక్షణమే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించి... తగిన చొరవ చూపాలని... లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా నష్టపోతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: వరుణాగ్రహం... ఇంటి పైకప్పు కూలి తల్లీకూతుళ్ల దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.