రాష్ట్రప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసమర్థత వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని మండిపడ్డారు.
కమీషన్ల కోసమే కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 450 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆపేలా జగన్‌పై కేసీఆర్ ఒత్తిడి తేవాలని సూచించారు.
- ఇదీ చూడండి: నిమ్జ్ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత