కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇష్టం లేకుంటే... కొవిడ్-19 పేరుతో చికిత్స అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత ఉందన... వీటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును మెచ్చుకుందో తెలుపాలని డిమాండ్ చేశారు.
కేంద్ర నిబంధనలకు అనుగుణంగా మేము అన్ని పాటిస్తుంటే... తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా నిబంధనలు అతిక్రమిస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు-ఎంపీలు మాత్రమే ప్రెస్‌మీట్ పెట్టాలని స్పీకర్ ఆదేశాలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే కానీ వ్యక్తి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎలా ప్రెస్ మీట్ పెట్టారంటూ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: 'వన్‌టైం సెటిల్మెంట్ను అందరూ వినియోగించుకోండి'