రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదన్న తెరాస నేత హరీశ్‌రావు వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. భాగ్యనగర వాసుల దాహార్తి తీర్చేందుకు కాంగ్రెస్ హయాంలోనే సింగూరు, మంజీరా జలాశయాల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం వల్లే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా హరీశ్‌రావు అసత్యాలు మానాలని హితవు పలికారు.
ఇదీ చూడండి : చర్చలు సఫలం... సమ్మె వరమించిన జూడాలు