ETV Bharat / state

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... నగరవాసిపై వరాల జల్లు

author img

By

Published : Nov 24, 2020, 7:05 PM IST

కాంగ్రెస్‌ పార్టీ నగర వాసిపై వరాలు జల్లు కురిపించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో పేద, మధ్య తరగతి ఓటర్లే ప్రధాన అజెండాగా హామీలు గుప్పించింది. అధికార తెరాస వైఫల్యాలను ఎత్తిచూపుతూనే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించింది. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌... వరద బాధిత కుటుంబానికి రూ.50వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2.5 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... నగరవాసిపై వరాల జల్లు
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... నగరవాసిపై వరాల జల్లు

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, పీసీసీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 పేజీలు మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌... గతంలో కాంగ్రెస్‌ నగరాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.

వరాల జల్లు...

పారిశ్రామికీకరణ, జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలు, విద్యారంగ అభివృద్ధి, హైదరాబాద్‌ నగర ప్రజల దాహార్తిని తీర్చడం, మౌళిక వసతుల సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయి నుంచి జీహెచ్‌ఎంసీగా మార్పు తదితరాలు కాంగ్రెస్‌ హాయాంలోనే అభివృద్ధి జరిగినట్లు మొదటి ఆరు పేజీల్లో వివరించింది. హైదరాబాద్‌ నగరాన్ని భూతల స్వర్గంగా మారుస్తామంటూ 2016లో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తెరాస ప్రకటించిన మేనిఫెస్టో... ఆ పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించిందని ఎత్తిచూపింది.

ప్రజల మధ్య విభజన...

తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత చెరువులు, కుంటలు కబ్జాలకు గురైనట్లు పేర్కొంది. అర్హులైన వారికి రెండు లక్షలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కట్టిస్తామని ఇచ్చిన హామీ నీటిమీద రాత అయిందని వ్యాఖ్యానించింది. భాజపా వైఫల్యాలను ఎత్తిచూపి ఎంఐఎం మత ప్రాతిపదికన ఓటర్లను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. భాజపా, ఎంఐఎం ఉమ్మడిగా ప్రజల మధ్య విభజన తెచ్చి ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నాయని ధ్వజమెత్తింది.

హామీల జల్లు...

ఇటీవల వచ్చిన వరదలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు తెరాస ఎలాంటి ప్రయత్నం చేయలేదని పేర్కొంటూ హామీల జల్లు కురిపించింది. వరద బాధిత కుటుంబానికి రూ. 50వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ. 5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. రెండున్నర లక్షలు లెక్కన ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించింది.

సాంకేతిక పరిజ్ఞానం...

భారీ వర్షాలు కారణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ. 25 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వరదలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు నగరంలో జపాన్‌, హాంకాంగ్‌, స్పెయిన్‌ లాంటి దేశాల్లో అనుసరించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూగర్భంలో నీటి నిల్వను పెంచి వరదను నిరోధించే కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికలతో అమలు చేస్తామని స్పష్టం చేసింది.

అన్ని సేవలకు ఒకే కార్డు...

హైదరాబాద్‌ నగరంలో 450కి బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతామని, ఆసుపత్రి పనివేళలను రాత్రి 9 గంటల వరకు పెంచుతామని పేర్కొంది. నగరంలో రవాణా సౌకర్యం మరింత మెరుగుపరుస్తామని, మెట్రో సేవలను శంషాబాద్‌ ఎయిర్​పోర్టు వరకు విస్తరిస్తామని చెప్పింది. ప్రజారవాణాకు చెంది అన్ని సేవలకు ఒకే కార్డును నగరవాసులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది.

అర్హులైన వారికి ఇళ్లు...

నగరంలో అర్హులైన పేదలందరికి రెండు పడక గదుల ఇండ్లను కట్టిస్తామని, ఇంటి జాగా ఉన్న వారికి రూ. 8లక్షలు, సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఉంటే అదనపు గది నిర్మాణం కోసం రూ. 4లక్షలు ఇస్తామని ప్రకటించింది. 2020 నుంచి గృహనిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇండ్లు అందించే వరకు ఏడాదికి రూ. 60 వేలు అందిస్తామని, వరదలు, అగ్నిప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు సంభవించి ఇళ్లు దెబ్బతింటే పరిహారం పొందేందుకు వీలుగా ఉచిత బీమా సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది.

ఉచితంగా విద్యుత్...

వంద యూనిట్లు లోపు విద్యుత్ వినియోగం జరిగే గృహ వినియోగదారులకు ఉచితంగా ఇస్తామని, ఆస్తిపన్నులో రూ. 50వేల వరకు రాయితీ, 80 గజాలు అంతకంటే తక్కువ జాగాలో ఇండ్లు కట్టుకొన్న వారికి ఆస్తిపన్ను నుంచి మినహాయింపు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు, మురికివాడల్లోని ఇళ్లకు ఆస్తిపన్ను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.30వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు అందించి ఉచితంగా వాటర్‌ కనెక్షన్‌ ఇస్తామని తెలిపింది.

ఎలాంటి రుసుం లేకుండానే...

ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌లకు ఎలాంటి రుసుం లేకుండానే క్రమబద్ధీకరణ చేస్తామని పేర్కొంది. మూసీనది ప్రక్షాళన, సఫాయి కర్మచారిలు, వారి కుటుంబాలకు రూ. 25లక్షల వరకు బీమా సదుపాయం, మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేకంగా మురికివాడల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్యను పెంచుతామని, సినిమా థియేటర్లు, మాల్స్‌కు పన్ను తగ్గింపు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలో అమ్మే తినుబండారాలను గరిష్ట చిల్లర ధరకే అమ్మేట్లు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. షీ బృందాల సంఖ్యను పెంచి మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని, రాత్రి పది గంటలకే మద్యం, బార్లు మూసివేసిలా చర్యలు తీసుకుంటామని వివరించింది.

ప్రత్యేక శ్రద్ధ...

అధికారంలోకి వస్తే సమగ్ర పట్టణాభివృద్ధి విధానం అమలు చేస్తామన్న కాంగ్రెస్... ట్రాఫిక్‌ నిర్వహణ, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచనున్నట్లు స్పష్టం చేసింది. జీవో 68ని రద్దు చేసి హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని తొలిగించి వాటిపై ఆధారపడిన కుటుంబాలకు చేయూతనందిస్తామని పేర్కొంది. కల్లు దుకాణాలు, బెల్ట్‌ షాపులు విద్యాసంస్థలు, రెసిడెన్షియల్‌ జోన్లల్లో లేకుండా వేరే చోటకు తరలిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'బస్తీ కోసం బరిలోకి దిగిన క్యాబ్ డ్రైవర్ భార్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.