కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా ఈ విషయం ప్రకటించారు. కమిటీ ఛైర్మన్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కాగా... మరో పదిమంది సభ్యులుగా ఉన్నారు.
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయ్య నాయక్, మైనారిటీ సెల్ పీసీసీ ఛైర్మన్ సాహెల్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మెదక్ మాజీ డీసీసీబీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, శ్రీరంగం సత్యం, గాలి అనిల్ కుమార్, మల్లాది పవన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తారు.
పురపాలక సంఘాల నుంచి స్థానిక సమస్యలు తెలుసుకుని... అన్నింటిని పరిశీలించి ప్రధానమైన సమస్యలను మేనిఫెస్టోలో పొందు పరచనున్నారు. పురపాలక, నగరపాలక సంస్థల వారీగా సమస్యలు గుర్తించి స్థానిక మేనిఫెస్టో తయారు చేస్తారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్