అర్హులందరికి వరద సాయం అందించాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జోనల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
ఇటీవలె కురిసిన భారీ వర్షాలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధికసాయం అర్హులకు అందలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆరోపించారు. అర్హులైన పేదలందరికి పది వేల రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'