ETV Bharat / state

'వట్టెం ముంపు బాధితులకు న్యాయం చేయండి'

వట్టెం జలాశయ భూ నిర్వాసితులకు సత్వర న్యాయం చేయాలని కాంగ్రెస్​ నేతలు నాగం జనార్దన్​రెడ్డి, మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. భూములు కోల్పోయే వారిని పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని విమర్శించారు. తగిన పరిహారం చెల్లించకుంటే తమ పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు.

కాంగ్రెస్​ నేతలు
author img

By

Published : Jun 18, 2019, 4:28 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ వట్టెం జలాశయ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారని కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​ రెడ్డి ఆరోపించారు. గతంలో ముంపు బాధితులకు న్యాయం చేయకుంటే తల నరుక్కుంటానన్న కేసీఆర్​ ఇప్పుడు వారిపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని గాంధీభవన్​లో విమర్శించారు. గిరిజనులు తమ సమస్యలు చెప్పుకుందామని ప్రగతిభవన్​కు వస్తే వారిని అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమని అన్నారు. వెంటనే ముంపునకు గురయ్యే ప్రాంతాల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

పోలీసు రాజ్యం నడుస్తోంది

ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. మల్లన్న సాగర్​ విషయంలో ఏ రకంగా రైతులకు పరిహారం ఇచ్చారో వట్టెం ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి అదే పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే తాము పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ముంపు బాధిత ప్రజలకు న్యాయం చేయాలన్న కాంగ్రెస్​ నేతలు

ఇదీ చూడండి : రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!

Intro:filename:

tg_adb_31_18_adivasilanu_paramarshinchina_poura_hakkula_sangham_avb_c11

Body:కుమురం భీం జిల్లా వెంపల్లి కలప డిపోలో ఆశ్రయం పొందుతున్న కోలం, గొండి ఆదివాసీలను పౌర హక్కుల సంఘం నాయకులు పరామర్శించారు.
అటవీ ప్రాంతం నుండి తరలించిన అదివాసీలకు ఆరు నెలల్లో భూమి ఏడాదిలోపు ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదివారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమిని ఇవ్వాలని.. వారికి పునరావాసం కల్పించేవరకు ఆదిలాబాద్ జిల్లాలోని వసతి గృహంలో ఉంచాలి అని ఆదేశించింది. అందులో అన్ని సౌకర్యాలు ఉండాలని స్పష్టం చేసింది. విద్య వైద్యం వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచాలని అంది.

ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం నాయకులు ఎన్. నారాయణ, మాదన కుమారస్వామి ఆదివాసీలను కలుసుకుని వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గిరిజనులకు పునరావాసం కల్పించాకనే వారిని గూడాలు ఖాళీ చేయించాల్సిదని కోర్టు వ్యాఖ్యానించింది అని అన్నారు. ఆదివాసీలు ఎదురోజులుగా డిపోలో ఉంటున్నారని.. అటవీశాఖ వారు కనీసం వారికి సరైన వసతి కల్పించడం లేదని అన్నారు. చిన్నపిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికి కూడా వారికి ఏక్కడ వసతి కల్పిస్తారు.. ఏలాంటి సౌకర్యాలు కల్పిస్తారు అనేదానిపై సరైన స్పష్టత లేదని అన్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని గిరిజనుల అభీష్టం మేరకు వారికి సరైన వసతి కల్పించాలని అన్నారు.

బైట్:
పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎన్. నారాయణ

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.