తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని అధికార తెరాస ప్రభుత్వం పక్కన బెట్టేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవాళ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా...హైదరాబాద్ గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి పలువురు నేతలు నివాళులర్పించారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, మధుయాష్కీగౌడ్, బలరాంనాయక్, సురేశ్ శట్కర్, అంజన్‌కుమార్ యాదవ్, రాజయ్య, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Formation Day: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు..