Komati reddy: మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో చురుక్కుగానే ఉన్నానని.. ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, ఇతర ముఖ్య నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు.
నేను దేన్నీ పట్టించుకోను. మొదటి నుంచి పార్టీలో కష్టపడుతున్న వారికే టికెట్లు ఇవ్వాలి. రాహుల్, సోనియాతో నేరుగా మాట్లాడి.. సర్వే చేయించి టికెట్లు ఇవ్వాలని కోరుతా. ఎందుకంటే పదేళ్లుగా కేసీఆర్‌ను తట్టుకుని పోరాడుతున్న వారికి ఇవ్వాలనేది నా డిమాండ్. ఇరవై ఏళ్ల కింద ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు పార్టీలో చేరేవారికి టికెట్లు ఇస్తే నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది.- కోమటి రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
పీఏసీకి రాలేనని తాను ముందే చెప్పినట్లు కోమటిరెడ్డి అన్నారు. 29 మందితో కమిటీ వేస్తే దానికి వెళ్లి తాను ఏం మాట్లాడతానని ప్రశ్నించారు. పీఏసీ కమిటీ సభ్యుల సంఖ్యను కుదించాలన్నారు. డాక్టర్ రవి చేరిక చెల్లక పోతే బిల్యా నాయక్ చేరిక ఎలా చెల్లుతుందన్నారు. బిల్యా నాయక్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి నష్టం చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అహ్మదాబాద్‌ను అదానిబాద్గా మార్చుకోమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు చెప్పానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సింగరేణి కోల్ బ్లాక్‌ను నైని కోల్ మైన్ కంపెనీకి అప్పగించారని ఆయన ఆరోపించారు. తమ పోరాటంతో దాన్ని వెనక్కి తీసుకున్నారన్నారు.
80 స్థానాల్లో గెలుపే లక్ష్యం: మానిక్కం ఠాగూర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మానిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, కోమటిరెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. దీనిపై విస్తృతంగా చర్చించాం. సిరిసిల్లలో ఏర్పాటుచేసే రాహుల్ గాంధీ సభపైనా చర్చించాం. మిషన్ తెలంగాణ మొదలైంది. ఏకాభిప్రాయంతోనే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. అందరితో కలిసి పని చేస్తాం. అన్ని కులాలను కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఒక్కరితో పార్టీ అధికారంలోకి రాదు. త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తాం. పార్టీలో చేరిన వాళ్లందరికీ టికెట్లు రావు’’ - మాణిక్కం ఠాగూర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
ఇవీ చదవండి: హైదరాబాద్‌లో మరో 2 రోజులు భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
నాలుగో అంతస్తు నుంచి దూకిన దొంగ.. దురదృష్టంకొద్దీ.