ETV Bharat / state

ఉమెన్ చాందీని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు - Congress leaders honored to Umen Chandi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఉమెన్‌ చాందీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. 50ఏళ్లుగా శాసనసభకు ఎన్నికవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సన్మానించినట్లు నాయకులు తెలిపారు.

ఉమెన్ చాందీనిని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

author img

By

Published : Sep 23, 2020, 9:07 PM IST

కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఉమెన్‌ చాందీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. 1970 నుంచి ఇప్పటివరకు వరుసగా 50 ఏళ్లుగా శాసనసభకు ఎన్నికవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పలు మలయాళీ సంఘాల ప్రతినిధులు బేగంపేట హరిత ప్లాజాలో ఉమెన్‌ చాందీని సన్మానించారు.

50 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతుండటం వల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ రీజియన్‌ మలయాళీ సంఘం అధ్యక్షుడు లిబ్బి బెంజమిన్‌ తెలిపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమన్వయ కమిటీ, విస్తృత స్థాయి కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇందిరా భవన్‌ వచ్చిన ఆయనను ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆయనను సన్మానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు హనుమంతురావుతో పాటు పలువురు నాయకులు శాలువ కప్పి సన్మానించారు.

ఇదీ చూడండి: అవినీతి తిమింగళం: ఏసీపీ ఇంట్లో సోదాలు.. రూ.70 కోట్ల ఆస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.