తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తప్పుడు విద్యార్హత ధ్రువపత్రాలతో రోహిత్‌రెడ్డి పట్టభద్రుడిగా ఓటు నమోదు చేసుకున్నారని ఆరోపించారు. విద్యార్హతలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను బుద్దభవన్‌లో కలిసిన మర్రిశశిధర్‌రెడ్డి బృందం విజ్ఞప్తి చేసింది.
ఆయన 2009లో, 2018లో దాఖలు చేసిన అఫిడవిట్లలో తేడాలు ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత అని ఒకదానిలో... ఎంబీఏ అని మరొకదానిలో చూపారని పేర్కొన్నారు. మర్రి శశిధర్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరంజన్ తదిరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ను విచారణకు ఆదేశిస్తానని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ చెప్పినట్లు వారు వివరించారు.
ఇదీ చదవండి: రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్