ETV Bharat / state

దీక్ష విరమించిన వి.హన్మంతరావు​

పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ గత 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు దీక్షను విరమించారు. ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్​నిమ్మరసం ఇచ్చి వీహెచ్​తో దీక్ష విరమింపజేశారు.

v.hanumantha rao withdraw hunger strike
v.hanumantha rao withdraw hunger strike
author img

By

Published : Apr 15, 2021, 3:31 PM IST

Updated : Apr 15, 2021, 4:08 PM IST

కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్​ నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు.

పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు రోజులుగా అంబర్‌పేటలోని స్వగృహంలో వీహెచ్​ ఆమరణ దీక్షకు దిగారు. వీహెచ్​ నివాసానికి వెళ్లిన మాణిక్కం ఠాగూర్‌ ఆరోగ్య కారణాల రీత్యా దీక్షను విరమించాలని, కాంగ్రెస్‌ పార్టీ ముందుండి పోరాటాన్ని కొనసాగిస్తుందని హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై షర్మిల స్పందించాలని వీహెచ్​ చురకలంటించారు.

ఇదీ చూడండి: 'కనీసం 17 వేల మెజారిటీతో జానారెడ్డి విజయం సాధిస్తారు'

Last Updated : Apr 15, 2021, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.