హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి స్థాయి మరిచి పోయి ఇష్టానుసారంగా మాట్లాడారని, స్థాయి తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులపై, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ పైన చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. తెరాస పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడారని విమర్శించారు. 2018లో హుజూరాబాద్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే కౌశిక్ రెడ్డి నాయకుడయ్యాడని.. ఆ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గు చేటని అన్నారు.
ఇదీ చదవండి: Kaushik Reddy: '50 కోట్లు ఇచ్చి రేవంత్ అధ్యక్షుడయ్యాడు.. ఆరునెలల్లో కాంగ్రెస్ ఖాళీ!'