తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో పౌరసత్వ సవరణ చట్టంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రతి రాష్ట్రం షాహీన్‌బాగ్ మాదిరి కావాలని పిలుపునిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ చట్టంపై ఎవరు భయపడాల్సిన పని లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పినా ఆందోళనలు ఆగడం లేదని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జనాభా లెక్కల పేరుతో ఎన్‌పీఆర్ జరుగుతోందన్నారు. కేసీఆర్, అసదుద్దీన్ కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం... ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా అన్యాయం చేస్తుందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను కేసీఆర్ డబ్బులు పెట్టి కొన్నాడని షబ్బీర్ అలీ ఆరోపించారు.