ETV Bharat / state

'కేసీఆర్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లే' - రేవంత్​రెడ్డి

కేసీఆర్​ మోదీ చెప్పుచేతల్లో ఉన్నారని కాంగ్రెస్​ నేత రేవంత్​రెడ్డి విమర్శించారు. సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. మల్కాజిగిరి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

రేవంత్​రెడ్డి
author img

By

Published : Mar 17, 2019, 3:10 PM IST

కేసీఆర్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని కాంగ్రెస్​ నేత, మల్కాజిగిరి లోక్​సభ అభ్యర్థి రేవంత్​రెడ్డి విమర్శించారు. హైదరాబాద్​లోని సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర నామమాత్రమేనన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్​ వాదనలో డొల్లతనం ఉందని ఎద్దేవా చేశారు.
మోదీ పాలనలో నియంతృత్వ ధోరణి పెరిగిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో రాజకీయాలు కలుషితమయ్యాయని ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్​రెడ్డి

ఇవీ చూడండి:జనసేనలో చేరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.