కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈరోజు రాత్రి 9గంటల సమయంలో ఆయనను జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు అపోలో ఆస్పత్రి అధికారికంగా ప్రకటన జారీ చేసింది.
నాన్నకు చికిత్స నడుస్తోంది: విక్రం గౌడ్
తన తండ్రి ఆరోగ్యంపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ వెల్లడించారు. ప్రస్తుతం నాన్నకు చికిత్స జరుగుతుందని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: జననేత జైపాల్ రెడ్డికి అశ్రునివాళి