తెలంగాణ కాంగ్రెస్‌లో చిన్నపాటి సమాచార లోపం పెద్ద వివాదానికి దారితీసింది(Internal strife in tpcc). జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్న్‌మెంటు కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ జిల్లా ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు(jaggareddy and revanth reddy controversy). తనకు సమాచారం లేకుండా నియోజకవర్గానికిి వెళ్లడంతో, పీసీసీ అధ్యక్షుడికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు పరోక్షంగా పీసీసీ(tpcc) చెప్పాలనుకున్నారా? అని మీడియా ముందు జగ్గారెడ్డి నిలదీశారు. దీంతో అప్రమత్తమైన ఏఐసీసీ.... నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మీడియా ముందుకు వెళ్లడం సరికాదని తీవ్రంగా స్పందించిన అధిష్ఠానం... రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ కార్యదర్శుల ద్వారా విషయాన్ని ఆరా తీసింది. జగ్గారెడ్డితో కూర్చొని చర్చించాలని కూడా స్పష్టం చేసింది.
అధిష్ఠానం జోక్యంతో..
ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ ఆదేశాలతో.... మరోసారి ఏఐసీసీ కార్యదర్శులైన శ్రీనివాస్ కృష్ణణ్, బోసురాజులు జగ్గారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకపోవడం తప్పేనని... అయినా పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సింది పోయి... మీడియా ముందు పార్టీ నష్టపోయేట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదని జగ్గారెడ్డికి తేల్చి చెప్పారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి.. తాను మీడియా ముందు పీసీసీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని... అందుకే తాను పార్టీకి క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు. తాను భవిష్యత్తులో మీడియా ముందు పార్టీకి చెందిన అంశాలపై మాట్లాడనని స్పష్టం చేశారు.
ఇక నుంచి అలా చేయండి..
జగ్గారెడ్డి ఉదంతంతో అప్రమత్తమైన ఏఐసీసీ.... పీసీసీ స్థాయిలో జరుగుతున్న తప్పులు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇకపై రాష్ట్ర స్థాయి నాయకులు... అసెంబ్లీ నియోజక వర్గాలకుకాని, పార్లమెంటు నియోజక వర్గాలకుకాని వెళ్లినప్పుడు ఆయా జిల్లాల నాయకులకు, స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేసినట్లు ఆయన వెల్లడించారు. వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ సమన్వయకర్త మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు గాంధీభవన్ నుంచి కూడా సంబంధిత నాయకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పోడుభూముల సమస్యపై ప్రతిపక్షాలతో కలిసి పోరాటం
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై పోరాటం ఉద్ధృతం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. శనివారం సుదీర్ఘంగా 6 గంటలపాటు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి, తీర్మానాలు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పోడు భూముల సమస్యపై అక్టోబర్ 5న ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినా.... అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వాయిదా వేశామన్నారు. ప్రతిపక్షాలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.
ఇదీ చూడండి: Jaggareddy: రేవంత్‌పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌కి కారణమేంటి?